📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబేగంపేట్‌లో పోషణ్ మాసం కార్యక్రమం

బేగంపేట్‌లో పోషణ్ మాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బేగంపేట్‌లో పోషణ్ మాసం కార్యక్రమం

గర్భిణీలు,బాలింతలకు పోషకాహారంపై అవగాహన

బెజ్జంకి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట్ గ్రామంలో సెక్టార్ లెవెల్ పోషణ్ మాసం కార్యక్రమాన్ని సీడీపీఓ సుశీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు,చిన్నారులకు అన్నప్రాసన,రెండవ కాన్పులో ఆడపిల్లలకు బేబీ కిట్లను అందజేశారు. బాలామృతం, అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో వివిధ రకాల పోషకాహార వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. పోషకాహారం ప్రాధాన్యతపై గర్భిణీలు, బాలింతలు, తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి, ఉమెన్స్ హబ్ పద్మ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.