బిఆర్ఎస్ ఉన్మాద చర్యాలపై
కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన
దళిత స్పీకర్ పై బిఆర్ఎస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు
తాతా మధు తీరుపై దంతాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన
దంతాలపల్లి మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరికృష్ణ
దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దంతాలపల్లిమండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన చేపట్టారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ఆదేశాల మేరకు, కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మతో నిరసన
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, దళిత స్పీకర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమని అన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ స్పీకర్ పీఠాన్ని అవమానించేలా వ్యవహరించిన తాతా మధుపై తక్షణమే చర్యలు తీసుకుని, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.అవమానాన్ని సహించం.అన్యాయాన్ని ప్రశ్నిస్తాం!ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది!
ఈ కార్యక్రమం పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీష్, దంతాలపల్లి సర్పంచ్ బాలాజీ, దoతాలపల్లి మాజీ ఎంపీటీసీ సతీష్ రామంజపురం సర్పంచ్ దామోదర్ రెడ్డి, దొనకొండ సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్, వేములపల్లి సర్పంచ్ గుమ్మడవెల్లి రవి సర్పంచ్ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

