📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonపాలకుర్తిలో ఘనంగా మట్టి గణపయ్య నిమజ్జనం

పాలకుర్తిలో ఘనంగా మట్టి గణపయ్య నిమజ్జనం

📰 Generate e-Paper Clip

*పాలకుర్తిలో ఘనంగా మట్టి గణపయ్య నిమజ్జనం*

జనగామ జిల్లా ప్రతినిధి (పాలకుర్తి), సెప్టెంబర్ 23(ప్రజావాణి):

పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటుతూ ప్రతిష్టించిన శ్రీ మట్టి గణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం డప్పు వాయిద్యాలు, భజనలు, గణపతి నామస్మరణల మధ్య శోభాయాత్రగా నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని “గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ హితమైన మట్టి గణపతుల ప్రతిష్టాపన ప్రతి ఒక్కరూ చేపట్టాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గం సుఖశాంతులు, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువత, కార్యకర్తలు, భక్తులు, పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.