పస్రాలో శాంతి కమిటీ సమావేశం
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) వినాయక చవితి పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా మత సామరస్యం, ఐక్యతతో మెలగాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలు ఏమైనా...