నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
స్థానిక గాంధీజీ విద్యాసంస్థలలో గురువారం నాడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, గొల్లభామల వేషధారణలో సందడి చేసి ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణ, ఉట్టికొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణాష్టమి విశిష్టతను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతోపాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు. పండుగల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రతి ఒక్కరు భావితరాలకు అందించాలని. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జాని,పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

