📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyధర్మ పరిరక్షణతో పాటు వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం

ధర్మ పరిరక్షణతో పాటు వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం

📰 Generate e-Paper Clip

•ధర్మ పరిరక్షణతో పాటు వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహకం

*బీరంగూడ లోని డ్రైఫ్రూట్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈర్ల రాజు

అమీన్పూర్, సెప్టెంబర్‌ 5 (ప్రజావాణి): పటాన్‌చెరు టౌన్‌లో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ శ్రీకృష్ణ భగవానుడి బ్రహ్మోత్సవాల్లో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలని, సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించాలని అన్నారు. కార్యక్రమంలో కిష్టయ్య యాదవ్, సన్నీ యాదవ్, రాజచారి పంతులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అమీన్పూర్ మండలం బీరంగూడ డివిజన్ గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో రాజస్థానీ మార్వాడీ మిత్రులు ఏర్పాటు చేసిన నూతన డ్రై ఫ్రూట్స్ షాప్‌ను ఈర్ల రాజు ముదిరాజ్ ప్రారంభించారు. నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత, వ్యాపారులు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి స్థానిక ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు మనోజ్ జీ, విట్టల్ జీ, పరమేశ్వర్, దీపక్, మనోహర్, రతన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.