దళిత బంధు లబ్ధిదారుల కోసం రిలే నిరాహార దీక్ష గోడ పోస్టర్ ఆవిష్కరణ
* తెలంగాణ రక్షణ సేననాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో
* నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు అంబాల హరీష్,
జమ్మికుంటసెప్టెంబర్ 10 (ప్రజావాణి)
హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేననాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 2026 శనివారం నాడు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించబోయేరిలే నిరాహార దీక్ష కు సంబంధించిన గోడపత్రికను (పోస్టర్) టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డి ఆర్ఎనుగు మల్లారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సన్నాహక సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఈ
ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డి ఆర్ఎనుగు మల్లారెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్ యాదవ్ కోరపల్లి సురేష్ హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు అంబాల హరీష్, కిరణ్ నరేష్ రితీష్ పాల్గొన్నారుఅదేవిధంగా యువజన విభాగం యూత్ నాయకులుకార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూదళిత బంధు రానీ రెండో విడత పెండింగ్ లబ్ధిదారులకు అండగా ఉండటానికే ఈ రిలే నిరాహార దీక్షను చేపడుతున్నాంకాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి దళిత సోదరులు ఎవరూ మోసపోవద్దువారు మీ జీవితాలతో ఆడుకుంటున్నారు దళిత బంధు అనేది ఎవరిచ్చిన భిక్ష కాదుఅది మన ఆత్మగౌరవంలబ్ధిదారులందరికీ న్యాయం జరిగే వరకు మా తెలంగాణ రక్షణసేన పోరాటం ఆగదుఈ శనివారం సెప్టెంబర్ 12 హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగబోయే ఈ రిలే నిరాహార దీక్షకు దళిత బంధు లబ్ధిదారులుయువత ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

