📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaజిల్లెల్లలో డెంగ్యూ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

జిల్లెల్లలో డెంగ్యూ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

📰 Generate e-Paper Clip

జిల్లెల్లలో డెంగ్యూ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

ఇంటింటి సర్వే.. 50 మందికి పైగా వైద్య పరీక్షలు

పరిసర ప్రాంతాల్లో యాంటీ లార్వా, పైరెథ్రిన్ స్ప్రే

తంగళ్లపల్లి, సెప్టెంబర్ 25, ప్రజావాణి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
గ్రామానికి చెందిన సవడవేని లక్ష్మవ్వ (భర్త వెంకటయ్య)కు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది ఆమె నివాస పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మందును పిచికారీ చేయడంతో పాటు, దోమల నివారణకు పైరెథ్రిన్ స్ప్రే చేపట్టారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా ఎంపి హెచ్ ఈఓ కె.రాజు మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం నిర్వహించిన సర్వేలో 50 మందికి పైగా వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
నేరెళ్ల మెడికల్ ఆఫీసర్ చంద్రిక మాట్లాడుతూ.. జిల్లెల్ల గ్రామంలో డెంగ్యూ నివారణ చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు
అందించనున్నట్లు వెల్లడించారు. గ్రామస్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.