చిలిపిచెడ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చిలిపిచెడ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం.. శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కారం చిలిపిచెడ్, సెప్టెంబర్ 24 ప్రజావాణి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి...