📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర...

చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

📰 Generate e-Paper Clip

చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి – జిల్లా ఎస్పీ..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్‌, సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ కి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులు, కోర్టు కేసుల వివరాలను పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, ఆధారాలను పకడ్బందీగా సేకరించి, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. అలాగే స్టేషన్‌లోని క్రైమ్ రిజిస్టర్, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, సీడీ ఫైల్స్, కోర్టు కేసుల రికార్డులు, స్టేషన్ రికార్డులు, బీట్ బుక్స్ తదితర రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, గతంలో నేరాలు జరిగిన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరమైన పరిధిలో తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు. చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట్ల బీట్ పెట్రోలింగ్‌ను పెంచాలని సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ను మరింత పటిష్టం చేసి నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు, సెలవులు, వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకుని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ఈ వార్షిక తనిఖీలో ఎస్పీ వెంట నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సీఐ రాము, డి.సి. ఆర్.బి సిఐ శ్రీను నాయక్, ఎస్.ఐ శివకుమార్ సంబంధిత పోలీస్ అధికారులు, చండూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.