📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadగిరిజన, ఆదివాసీ హక్కులను కాపాడాలి: ఢిల్లీలో గిరిజన సంఘాల మహాధర్నా

గిరిజన, ఆదివాసీ హక్కులను కాపాడాలి: ఢిల్లీలో గిరిజన సంఘాల మహాధర్నా

📰 Generate e-Paper Clip

గిరిజన, ఆదివాసీ హక్కులను కాపాడాలి: ఢిల్లీలో గిరిజన సంఘాల మహాధర్నా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలు వీడనాడాలి
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, మానుకోటలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి
పోడు భూములకు పట్టాలు, ఖాళీ ఉద్యోగాల భర్తీకి డిమాండ్
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్  7, ప్రజావాణి :

గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న వివక్షను వీడనాడాలని, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలోని షహీద్ పార్క్ (ఢిల్లీ గేట్) వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ గిరిజన సంఘం , ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్  సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు, ఆదివాసీలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, నాయకులు భూక్యా వీరభద్రం నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ కిషన్ నాయక్ ప్రసంగిస్తూ… దేశవ్యాప్తంగా గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గిరిజనులను వారి సాగుభూముల నుంచి బలవంతంగా వెళ్లగొట్టే కుట్రలను తక్షణమే విరమించుకోవాలని హెచ్చరించారు.

ప్రధాన డిమాండ్లు:

భూ హక్కుల పరిరక్షణ: అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి పోడు సాగుదారులందరికీ వెంటనే హక్కు పత్రాలు (పట్టాలు) అందించాలి.
ప్రాంతీయ అభివృద్ధి: విభజన చట్టం హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమను వెంటనే స్థాపించాలి; మహబూబాబాద్ (మానుకోట) కేంద్రంగా ఐటీడీఏ  ఏర్పాటు చేయాలి.
ఉద్యోగాల భర్తీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి, గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి.
మౌలిక సదుపాయాలు: గిరిజన గూడేలు, తండాల్లో నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్థాయి వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించి రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాలి.
సమస్యలు పరిష్కారమయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.

ఈ మహాధర్నా కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఈశ్వర్, గోపి నాయక్, శోభన్, నేనావాత్ పార్వతి, శంకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.