కొండాపూర్‌లో రేసు ఫ్యామిలీ గణనాథుడికి ప్రత్యేకపూజలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ఘట్కేసర్ మండల పరిధిలోని కొండాపూర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి పుష్పాలు, పండ్లు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్...