📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా వందనం

కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా వందనం

📰 Generate e-Paper Clip

*కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా వందనం..*

*మన ప్రజావాణి*
మంచిర్యాల

కాంగ్రెస్ సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో నాలుగో ఆదివారం నిర్వహించే జెండా వందనం కార్యక్రమం మంచిర్యాల పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు హఫీజ్ రహమాన్, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో సేవాదళ్‌కు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని అన్నారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సేవాదళ్ ప్రజల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రతి నెల నాలుగో ఆదివారం సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెండా వందనం కార్యక్రమం జాతీయ భావాలను, దేశభక్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.జాతీయ జెండా పట్ల గౌరవం,రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి వంటి అంశాలను ప్రతి ఒక్కరిలో పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సేవాదళ్ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువై, సేవా కార్యక్రమాల్లో చురుకుగాపాల్గొనాలనిపిలుపునిచ్చారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అరిగేల పద్మ,రామంచి వనజ రాణి,లింగమూర్తి, రాజయ్య,పోషం, రాయమల్లు,మనోజ్,రవి, రాజమల్లు,తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.