కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక యువజన కాంగ్రెస్
గ్రామస్థాయిలో యువజన కాంగ్రెస్ ను పటిష్టం చేయాలి
పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారికి తగిన ప్రాధాన్యత
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి అన్నారు.
ఆదివారం నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ను గ్రామస్థాయిలో పటిష్టం చేయడానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అమలు చేసే సంక్షేమ పథకాలు అన్నిటిని అర్హులైన వారికి చేరే విధంగా చూడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.
నియోజకవర్గ, మండల కమిటీ లో ఉంటూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనని వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. సర్ కార్యక్రమంలో ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త భాగస్వాములై అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. ఎక్కడైనా అరులైన ఓట్లు తొలగిస్తే తిరిగి వాటిని చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న నల్లగొండ-ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో యువజన కాంగ్రెస్ సత్తా చాటాల అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నియమించిన వారి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా ఇంచార్జ్ గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కోర్ర రామ్ సింగ్ లు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చురుకుగా పని చేస్తేనే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఇప్పటికైనా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ర గౌతమి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి, కార్పొరేటర్ మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు కె.వి.ఆర్ సతీష్, నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘునాథ్ రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్, మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్రెడ్డి భానుచందర్ రెడ్డి, కంచర్ల ఆనంద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

