కస్తూర్బా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

కస్తూర్బా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించిన సర్పంచ్, ఎంపీడీవో గరిడేపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్, ఎంపీడీవో సరోజ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా తనిఖీ చేసి, వాటి నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను, వంటగదిని...