ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు
అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ.
.రివైజ్డ్ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలి.
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.
ప్రజావాణి/ములుగు ప్రతినిధి
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు :: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు.
*సవరించిన షెడ్యూల్*
క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ:17 ఆగస్టు – 7 అక్టోబర్
నోటీసుల దశ, విచారణలు, క్లెయిమ్స్ – అభ్యంతరాల పరిష్కారం:17 ఆగస్టు – 5 నవంబర్
తుది ఓటరు జాబితా ప్రచురణ:9 నవంబర్
జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు), సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు (BLOలు) సవరించిన షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు లోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.

