📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఎల్కతుర్తి సహకార సంఘం చైర్మన్‌గా ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి నియామకం

ఎల్కతుర్తి సహకార సంఘం చైర్మన్‌గా ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి నియామకం

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి సహకార సంఘం చైర్మన్‌గా ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి నియామకం

రైతులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సహకార సంఘం చైర్మన్‌గా ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు సహకార సంఘం డైరెక్టర్లుగా శనిగరపు స్వరూప,ఎడవల్లి అశోక్‌రెడ్డి,పుల్లూరి నర్సింహారావు, బొమ్మరబోయిన కుమారస్వామి,చిర్ర రాజయ్య,చల్ల ధనలక్ష్మి, మోడం రాజయ్య,ఇనుగాల సుధాకర్,బక్కయ్య, వీరమల్ల ముకుందరెడ్డి,మద్దె రాములు నియమితులయ్యారు.
ఎల్కతుర్తి సహకార సంఘం పరిధిలోని రైతులకు అవసరమైన సహకార సేవలను మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉంది. రైతులకు పంట రుణాలు,వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర సేవలను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు,సహకార సంఘం కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
రైతులు ఎదుర్కొంటున్న రుణాలు,వ్యవసాయ పెట్టుబడులు,పంటల సాగుకు సంబంధించిన సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.సహకార సంఘం ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందించి,సంఘం అభివృద్ధికి నూతన చైర్మన్‌,డైరెక్టర్లు కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో ఎల్కతుర్తి సహకార సంఘం కార్యకలాపాలు మరింత చురుకుగా సాగుతాయని,రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.