ఎంబేరు మన్నారు స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
*ఎంబేరు మన్నారు స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలోని ఎంబేరు మన్నారు స్వామి దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నియమితులైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన పాలకమండలి సభ్యులుగా జొర్రీగల మల్లారెడ్డి, పెద్దకుల కనకయ్య, ఆకుల...