*అశ్విని మృతి తీవ్రంగా కలచివేసింది*
*మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్*
*కమ్మదనం గురుకుల పాఠశాలను సందర్శించిన అంజయ్య యాదవ్*
షాద్‌నగర్ ప్రజావాణి ఆగస్టు 04: నియోజకవర్గంలోని కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని మూడవత్ అశ్విని మృతి చెందడం బాధాకరమని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ ఈరోజు కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థిని మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని, అశ్విని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. అశ్విని మృతికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అంజయ్య యాదవ్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, కౌన్సెలింగ్ అందిస్తూ వారి సమస్యలను తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అశ్విని కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మన్నె కవిత నారాయణ, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సర్పంచ్ లత కిరణ్, మాజీ సర్పంచ్ నరసింహా, నాయకులు రాజు, రాఘవేందర్ రెడ్డి, గుడిసె బాలరాజు, అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

