అల్లం సాయికుమార్ బిజెపి పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం
దంతాలపల్లి లో విగ్రహ ఆవిష్కరణ
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటాత్ హుస్సేన్ నాయక్
దంతాలపల్లి మండలంలో బిజెపి పార్టీ మంచి నాయకున్ని కోల్పోయిందనీ, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో హుస్సేన్ నాయక్ అన్నారు. బుధవారం దంతాలపల్లి మండల కేంద్రంలో
బిజెపి నాయకుడు అల్లం సాయికుమార్ విగ్రహ ఆవిష్కరణల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగ హుస్సేన్ నాయక్ , పాల్గొని విగ్ర ఆవిష్కరణ చేసి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లం సాయికుమార్, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, నిస్వార్ధ నాయకుడని ఆయన సేవలను గుర్తు చేశారు, అల్లం కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అన్నదమ్ములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకం కోసం పార్కు నిర్మించడం ఎంతో సంతోషకరమని అలాంటి మంచి నాయకున్ని గుర్తుంచుకోవడం కోసం కుటుంబ సభ్యులు చేసిన పనిని ఆయన కొని ఆడారు మంచికి మారుపేరు బిజెపికి చేసిన సేవలు చాలా గొప్పవిఅని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, అల్లం సాయి కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ , శివరాజ్ , లక్ష్మణ్ , బిజెపి నాయకులు
గరికపాటి మోహన్రావు మాజీ రాజ్యసభ సభ్యులు,మార్తనేని ధర్మారావు హనుమకొండ మాజీ ఎమ్మెల్యే,, వల్లభు వెంకటేశ్వర్లు మానుకోట జిల్లా అధ్యక్షులు, సీతారాం నాయక్, దాసరి మురళి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

