అరేపల్లి NSR ఆసుపత్రి ICU లో మృత్యువుతో పోరాడుతున్న యువకులు
కొండి భార్గవ్ కు అత్యవసరంగా రూ. 10 లక్షల సాయం అవసరం – కుటుంబ సభ్యుల ఆవేదన
ములుగు ప్రతినిధి (ప్రజావాణి)
అరేపల్లి లోని NSR హాస్పిటల్ ICU లో కొండి భార్గవ్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బీసీయూ క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ పై ఉన్న భార్గవ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బీసీయూ చికిత్సకు సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, తమ నిరుపేద కుటుంబానికి అంత మొత్తం భరించే శక్తి లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతలు, దయార్ద్ర హృదయులు ముందుకు వచ్చి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
*సహాయం చేయదలచిన వారు:*
*PhonePe / Google Pay: 7815872465*
*UPI ID: 7815872465-2@ybl*
*QR కోడ్ స్కాన్ చేసి సహాయం చేయవచ్చు.*
*వార్త – 2*
*దార్ల విద్యాసాగర్ కు సర్జరీకి రూ. 10 లక్షలు అవసరం – తల్లి కన్నీటి విన్నపం*
*అరేపల్లి:* జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దార్ల విద్యాసాగర్ ప్రస్తుతం అరేపల్లి NSR హాస్పిటల్ ICU లో మృత్యువుతో పోరాడుతున్నాడు. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న ఫోటో చూస్తేనే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది.
తలకు తీవ్ర గాయం కావడంతో అత్యవసర సర్జరీ చేయాలని, దానికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని తల్లి అనిత తెలిపారు. ఉన్నదంతా ఊడ్చి ఆసుపత్రికి కట్టినా ఇంకా చాలా డబ్బు అవసరం ఉందని, బిడ్డ ప్రాణం కాపాడేందుకు దాతలు ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమవుతూ కోరుతున్నారు.
*సహాయం కోసం సంప్రదించండి:*
*తల్లి అనిత – 63042 74341*
మీరు చేసే చిన్న సహాయం ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది.
Score: Prajavaani

