EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakహర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలి

హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలి

బీజేపీ జిల్లా సమావేశంలో నాయకుల పిలుపు

మెదక్, ఆగస్టు 7: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా యాత్ర’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ మెదక్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ కార్యక్రమాలపై చర్చించేందుకు శుక్రవారం మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి బొక్క నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా యాత్ర’ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై నాయకులతో చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడం, జాతీయ జెండాల పంపిణీ, జాతీయ పతాక ఆవిష్కరణ, దేశభక్తిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నాయకులకు సూచించారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి భావనను ప్రతి ఒక్కరిలో పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి స్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ జెండా ప్రాధాన్యతను వివరించాలని కోరారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం కాశీనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు కౌన్సిల్ శంకర్ గౌడ్, రాజేందర్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, జిల్లా కార్యదర్శులు కల్కి నాగరాజు, అశోక్, సాదుల బిక్షపతి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్‌ఎన్ రెడ్డి, విజయ్ కుమార్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు జనార్దన్, యువ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, గిరిజన మోర్చా అధ్యక్షులు రాములు నాయక్, మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఖిచ్చి జ్ఞాన్ సింగ్, జిల్లా నాయకులు పబ్బ సత్యం, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏసీ రెడ్డి, మండల అధ్యక్షులు, సర్పంచులు బెండె వీణ, సంతోష్ చారి, శ్రీనివాస్, నగేష్, హరీష్, వివిధ మోర్చాల మండల, పట్టణ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.