సుద్దాల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ’కి హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం
ప్రజావాణి (ఆగస్టు 10)
రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్ కూతురు ,పద్మశ్రీ వనజీవి హరిత అవార్డు గ్రహిత ప్రకృతి బ్లెస్సి (12) సం, బద్దెనపల్లి గురుకులంలో ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతుంది,పర్యావరణ పరిరక్షణ ప్రకృతి పచ్చదనం జీవకోటి మనుగడ అడవుల సంరక్షణ కోసం, తాను మూడు సంవత్సరాల వయసు నుండి , ప్రకృతిలో ఉన్న చెట్లు అడవులు బుట్టలు అంతరించిపోతే చనిపోతమనే భయంతో బాధ్యతగా, మూడు సంవత్సరాల వయస్సు నుండి పది సంవత్సరాల క్రితం నుండి, చెట్ల క్రింద రాలిన విత్తనాలను సేకరించి వాటిని మట్టితో కలిపి విత్తన బంతులుగాచేసి తన తండ్రి సహకారం డ్రోన్ల సహాయంతో , తెలంగాణ కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అడవులలో ఇప్పటివరకు 2 లక్షల 65 వేల విత్తనాలు మరియు విత్తన బంతులను వేసింది తన తండ్రి ప్రకాష్ ద్వారా వేయించింది, ప్రకృతి బ్లెస్సి తాను మూడవ సంవత్సరం అతి చిన్న వయస్సు 2017 నుండి, ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు కలిగి ఉండి , ప్రాణం పోసే ప్రకృతికే ప్రాణం పోస్తూ , ప్రకృతి సంరక్షణ కోసం సాగుతున్న చిన్నారులలో ప్రపంచంలోనే మొట్టమొదటి చిన్నారి తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన , పద్మశ్రీ వనజీవి హరిత అవార్డు గ్రహీత ప్రకృతి బ్లెస్సి అని గుర్తించి, , ఐ రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ను,హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ బ్రాండ్ అంబాసిడర్, మరియు గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి , సీఈఓ సుమన్ పల్లె చేతులమీదుగా బేబీ ప్రకృతి బ్లెస్సీ కి గచ్చిబౌలి ఇందూర్ స్టేడియం హైదరాబాద్ లో జరిగిన గిన్నిస్ బుక్ రికార్డు వేదికపై ఆదివారం ‘హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందజేశారు.చిన్నారి ప్రకృతి బ్లెస్సి మాట్లాడుతూ ఇంత గొప్ప అవార్డులు రికార్డులు నాకు రావడం ప్రకృతి సంరక్షణ కోసం ఇంకా బాధ్యతను తెచ్చి పెట్టాయని ప్రతి ఒక్కరు ప్రకృతి సంరక్షణ కోసం సాగితేనే భావితరాలకు జీవకోటికి మనుగడ ఉంటుందని తెలిపింది. నా కృషిని గుర్తించి నాకు ఇంత గొప్ప ఐరెంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును ఇచ్చిన వరల్డ్ బుక్ టీంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపింది. ఐరెంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును పొందిన ప్రకృతి బ్లేస్సి నీ బద్దెనపల్లి గురుకుల ప్రిన్సిపాల్ పద్మ గారు, మరియు సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు, కొనరావుపేట మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లన్న గారు ఫోన్ ద్వారా గ్రామానికి ఎంతో గర్వకారణం అని అభినందనలు తెలిపారు.
సుద్దాల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ’కి హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం
RELATED ARTICLES

