📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakసర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా

📰 Generate e-Paper Clip

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా

రామాయంపేట, ఆగస్టు 18: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వీరత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు. సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన పోరాటం నేటి స్ఫూర్తిదాయకమని తెలిపారు. యువతకు

అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలిచి, సామాజిక సమానత్వం కోసం పోరాడిన పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను ప్రజలకు గుర్తుచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.