వీణవంక మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
వీణవంక: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9న నిర్వహించనున్న చలో వరం
గల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నూతన మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వీణవంక మండలంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు.
మండల ఇన్‌చార్జిలు అంబాల మధునయ్య, మోరే అరుణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా రెడ్డిపల్లికి చెందిన అంబాల కళ్యాణ్‌ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా రుద్రారం కృష్ణ, మునిగాల శంకర్, ఉపాధ్యక్షులుగా ఊట్ల అశోక్, దాసారపు సమ్మయ్య, కొయ్యడ రాకేష్, కార్యదర్శులుగా నందిపాట రమేష్, ఈదునూరి పవన్‌ను ఎంపిక చేశారు.
అలాగే ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడిగా బెజ్జంకి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కాశపాక లూకా, ఉపాధ్యక్షుడిగా సిద్ధాంకి రాజేందర్, గాజుల సదయ్యలను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు, జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పర్లపల్లి తిరుపతి, దాసారపు శ్రీనివాస్, కండె మహేందర్, కొలుగూరి రమేష్, గాజుల సదయ్యతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీణవంక మండలం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
RELATED ARTICLES

గల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నూతన మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వీణవంక మండలంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు.