ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ప్రధాన రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. ఇరుకైన మూలమలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో నష్టపరిహారం రూ.80 వేలు తీసుకున్నా నిర్మాణాలు కొనసాగించడం సరైంది కాదన్నారు. అధికారులు సైడ్ డ్రెయిన్ పనుల వేళ సరిహద్దులు నిశ్చయించి, అడ్డంకులు తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగించాలి, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం వినతి
RELATED ARTICLES

