📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguరైతుల ఆవేదనకు స్పందించిన అశోక్

రైతుల ఆవేదనకు స్పందించిన అశోక్

📰 Generate e-Paper Clip

    1. .లక్నవరం నుంచి నీటి విడుదలకు హామీ.
      .పంటలు కాపాడేందుకు చర్యలు – అధికారులతో మాట్లాడి నీరు ఇప్పిస్తా.
      .వర్షాలు లేకపోయినా అండగా ఉంటాం – కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు.
      .రైతు కోసం రంగంలోకి అశోక్ – సాగునీటి సమస్యకు పరిష్కారం.

గోవిందరావుపేట మండలం( ప్రజావాణి)

రైతుల సాగునీటి సమస్యపై ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు స్పందించారు.
చల్వాయి గ్రామంలోని తన నివాసంలో గోవిందరావుపేట మండల రైతులతో సమావేశమైన అశోక్ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు విన్నవించారు.
లక్నవరం సరస్సులో నీరు అందుబాటులో ఉందని, అక్కడి నుంచి పంట కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు.
రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న అశోక్ గారు వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి లక్నవరం నుంచి పంట కాలువలకు సాగునీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సాగునీటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని, పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉంటాం. వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం అని అశోక్ గారు తెలిపారు.
రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన అశోక్ గారి చర్యను పలువురు రైతులు అభినందించారు.రైతు బాధ రైతు నాయకుడికి తెలుసు
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన గోవిందరావుపేట మండల రైతులను కలిసిన ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు.
లక్నవరం సరస్సు నుంచి పంట కాలువలకు నీటిని విడుదల చేయించి పంటలను కాపాడతామని హామీ ఇచ్చారు.
రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.