📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaరైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి

రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి.

మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి సీఎం. పరకాల పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి.

రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా మరియు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు హింగే భాస్కర్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత ఏడాది మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన ఉమ్మడి హనుమకొండ,కరీంనగర్ జిల్లా పరిధిలోని రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా మరియు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు హింగే భాస్కర్ డిమాండ్ చేశారు.
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని,పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి అండగా నిలవాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాలకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పంట నష్టపరిహారం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ప్రత్యేకంగా దృష్టి సారించాలని హింగే భాస్కర్ కోరారు.ఇప్పటికే నిర్వహించిన పంట నష్టం సర్వే వివరాలను సమీక్షించి, అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంట నష్టం సర్వేలో అర్హులైన రైతుల పేర్లు నమోదు కాకపోతే వారికి మరోసారి అవకాశం కల్పించాలని,ఎలాంటి వివక్ష లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని అన్నారు. పరిహారం ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై ముఖ్యమంత్రి పరకాల పర్యటనలో స్పష్టమైన తేదీ ప్రకటించాలని కోరారు.
“రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి,మొంథా తుఫాన్ నష్టపరిహారాన్ని ఇక ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో జమ చేయాలి.రైతులకు కేవలం హామీలు కాకుండా తక్షణ ఆర్థిక సహాయం అందించాలి”అని హింగే భాస్కర్ అన్నారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు సోకినే సుధాకర్ రావు,జిల్లా కార్యదర్శి అంబిర్ శ్రీనివాస్. మండల అధ్యక్షుడు కొప్పు తిరుపతి,నాయకులు భాష వేన కుమార్.రాములు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.