📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమేడ్చల్‌లో లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారంతో మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ప్రారంభం

మేడ్చల్‌లో లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారంతో మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఒక శిశువు జన్మించిన క్షణం కుటుంబానికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. అయితే నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జన్మించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆక్సిజన్ లోపం వంటి పరిస్థితులు ఎదురైతే అదే ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారుతుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకమే.

అలాంటి సమయంలో “అత్యవసర చికిత్స కోసం దూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. స్థానికంగానే అత్యాధునిక వైద్యం” అందించేందుకు మేడ్చల్‌లో మరో కీలక వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

మేడ్చల్‌కు కొత్త వైద్య అధ్యాయం

మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, ప్రముఖ చిన్నపిల్లల వైద్య సంస్థ లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారంతో అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు.

మేడ్చల్ పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ లెవల్–3 నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను శుక్రవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిషియన్, లోటస్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. వి.ఎస్.వి. ప్రసాద్ ప్రారంభించారు.

అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం

అపుడే పుట్టిన శిశువులకు ఎదురయ్యే అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఈ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్
కీలకంగా పనిచేయనుంది. ముఖ్యంగా నెలలు నిండకముందే జన్మించిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ లోపం, ఇన్ఫెక్షన్లు, పాలు తీసుకోలేని పరిస్థితులు తదితర అత్యవసర సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించేలా ఈ యూనిట్‌ను తీర్చిదిద్దారు.

ఆరు పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్
లో వెంటిలేటర్, శ్వాసకోశ సహాయక వ్యవస్థలు, ఇంక్యుబేటర్లు, ఉష్ణ సంరక్షణ తదితర ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

“ప్రతి నిమిషం విలువైనదే..”

నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్
ప్రారంభోత్సవం సందర్భంగా డా. వి.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. మేడ్చల్ ప్రాంతంలో నవజాత శిశువులకు అవసరమైన అత్యవసర వైద్య సేవలను స్థానికంగానే అందించే అత్యాధునిక సదుపాయం అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు.

శిశువులకు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలస్యం లేకుండా చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని, సరైన సమయంలో సరైన వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.

మేడ్చల్ ప్రజల వైద్య అవసరాలను గుర్తించి మెడినోవా హాస్పిటల్స్ ప్రత్యేక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

నేటి నుంచే సేవలు

ఈ అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సేవలు నేటి నుంచే రోగులకు అందుబాటులోకి వచ్చినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైన సందర్భాల్లో ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించింది.

పలువురు వైద్య ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, ప్రెసిడెంట్, మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీ ఐనిష్ మర్చంట్, సీఈవో, మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డా. సి. గీత, డైరెక్టర్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్, మెడిసిటి హాస్పిటల్స్, ఘన్‌పూర్‌తో పాటు మెడిసిటి, మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.

మేడ్చల్‌లో చిన్నారి ప్రాణాలకు అత్యవసర వైద్య భద్రతను మరింత చేరువ చేస్తూ ప్రారంభమైన ఈ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నవజాత శిశువుల కుటుంబాలకు ఒక కొత్త భరోసాగా నిలవనుంది అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.