📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakమెదక్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

మెదక్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మెదక్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
మెదక్, ఆగస్టు 13: భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వికసిత భారత్ లక్ష్యంగా మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని, దేశ ఐక్యతను పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండాల ప్రదర్శనతో దేశభక్తి వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్మనైన శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, నిజాంపేట మాజీ జెడ్పీటీసీ పంజాబీ చెయ్, హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్ పాల్గొన్నారు.
అలాగే మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మకొండ రాజేందర్, జిల్లా కార్యదర్శి సాధు అశోక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, బట్ల జనార్ధన్, పట్లోళ్ల మల్లిక, జ్ఞాన్‌సింగ్, హర్ ఘర్ తిరంగా కో-కన్వీనర్లు రాజేశ్వరి, సాయి సన్నీ, మెదక్ కౌన్సిలర్లు అఖిల, భారత్, పప్పా, రాజమణి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు మెదక్ జిల్లాలోని వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రతి కుటుంబానికి చేరవేయాలని నాయకులు కోరారు. దేశ ప్రగతి, ఐక్యత, సమగ్రత కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.