📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadమీర్ పేట లో జి ఎస్ ఫిటినెస్ జిమ్ ప్రారంభం

మీర్ పేట లో జి ఎస్ ఫిటినెస్ జిమ్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

మీర్ పేట లో జి ఎస్ ఫిటినెస్ జిమ్ ప్రారంభం

ప్రారంభించిన ఉప్పల్ ఎమ్ ఎల్ ఏ బండారి లక్ష్మా రెడ్డి

 

మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 2 గాడిపల్లి పరమేశ్వర్ జిల్లా ప్రతినిధి ( ప్రజావాణి ) మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని హెచ్‌బీ కాలనీ ఎన్‌ఎఫ్‌సీ మెయిన్ రోడ్డులో, వసంత రెడ్డి స్వీట్ షాప్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జీఎస్ ఫిట్‌నెస్ జిమ్ ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఆదివారం నాడు మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని హెచ్‌బీ కాలనీ ఎన్‌ఎఫ్‌సీ మెయిన్ రోడ్డులో, వసంత రెడ్డి స్వీట్ షాప్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జీఎస్ ఫిట్‌నెస్ జిమ్ ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిమ్ యజమాని గౌతమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతంగా సాగి మంచి లాభాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన జీవనానికి నిత్య వ్యాయామం ఎంతో అవసరమని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, మనశ్శాంతి కూడా లభిస్తాయని తెలిపారు. హెచ్‌బీ కాలనీ మెయిన్ రోడ్డులో ఆధునిక సౌకర్యాలతో జిమ్ ప్రారంభించడం ఆనందదాయకమని, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ కరిపే, ఉల్లెం బాలరాజు, రామకృష్ణ, నవీన్ గౌడ్, శేఖర్ గౌడ్, బాలయ్య గౌడ్, పూస రమేష్, కుమార్, జాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.