*మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి
*
భారత రత్నా,మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అటల్ బిహారీ వాజపేయి గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని,ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు అని గుర్తు చేశారు.కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి,మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కోశాధికారి లవంగ శ్రీకాంత్,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి,జకట ప్రేమ దాసు,ఉపాధ్యక్షులు మైసరి రాజు వంజరి,సీనియర్ నాయకులు చీర్ల సత్యనారాయణ,చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్,నాయకులు థాత్రిక నిఖిల్ వంజరి,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

