డ్రగ్స్,సైబర్ నేరాలు పటిష్ట దాడులు,పీ.డీ యాక్ట్ నమోదు.
రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ,ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు.
నేర నియంత్రణ,పాత నేరస్తులపై నిఘా,రాత్రి పహారా కట్టుదిట్టం.
అక్రమ కార్యకలాపాలు పేకాట,గుట్కా,ఇసుకపై నిరంతర దాడులు.
డయల్ 112 ప్రచారం ముమ్మరం చేయాలి.
రాబోవు పండుగల బందోబస్తు.24/7 వాహన తనిఖీలు, పటిష్ట ఏర్పాట్లు.
బోధన్ డివిజన్ సమీక్షలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,ఐ.పి.యస్ కీలక ఆదేశాలు.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,ఐ.పి.యస్ సమగ్ర సమీక్ష సమావేశం బుధవారం కోటగిరి పోలీస్ స్టేషన్ యందు నిర్వహించగా బోధన్ డివిజన్ ఏ.సీ.పీ,సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు,ఎస్.హెచ్.ఓలు, ఎస్సైలు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు డ్రగ్స్,గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని,అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు.సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని , ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు,రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సి.పి.బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించా మన్నారు.ముఖ్యంగా హత్య,హత్యాయత్నం,చోరీలు, మహిళలపై నేరాలు,సైబర్ మోసాలు,డ్రగ్స్,గంజాయి అక్రమ రవాణా,పేకాట,గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించామన్నారు.పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు.అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీషీటర్లు,పాత నేరస్తులు,బెయిల్‌పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి,అనుమానాస్పద వ్యక్తులు,వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,షీ టీమ్స్,ఈగల్ టీమ్స్,చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు,బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.అలాగే పేకాట,గుట్కా,ఇసుక,ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని,ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.రిసెప్షన్ నిర్వహణ,రికార్డుల నిర్వహణ,స్టేషన్ పరిశుభ్రత,సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి,నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు.చివరిగా శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని,ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమం బోధన్ ఏ.సి.పి పి.శ్రీనివాస్, సి.సి.ఆర్.బి ఎ.సి.పి గురునాయుడు,సి.సి.ఆర్బి ఇన్స్పెక్టర్ ఆర్.అంజయ్య,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,సీ.ఐ లు,ఎస్హెచ్ఓలు,ఎస్సైలు,ఐటి కోర్స్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

