బెజ్జంకి, ఆగస్టు 31 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 23 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 5 వినతులు స్వీకరించినట్లు ఎంపీడీఓ కడి వెర్గు ప్రవీణ్ తెలిపారు.ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

