📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ సెల్ బెల్లంకొండ మల్లేష్ గౌడ్

బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ సెల్ బెల్లంకొండ మల్లేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ సెల్ బెల్లంకొండ మల్లేష్ గౌడ్

మేడిపల్లి ఆగస్టు 07(మన ప్రజావాణి)భారతీయ జనతాపార్టీ మేడ్చెల్ రూరల్ ఎండోమెంట్ సెల్, బోడుప్పల్ డివిజన్ కో కన్వీనర్ గా బోడుప్పల్ సర్కిల్ కు చెందిన బీజేపి నాయకులు బెల్లంకొండ మల్లేష్ గౌడ్ నియమితులై య్యారు.ఈ మేరకు బీజేపి మేడ్చల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ రాష్ట్ర కో కన్వీనర్,జిల్లా నాయకులు కే శ్రీనివాస్ ముదిరాజ్ నియామక పత్రాన్ని జారీ చేశారు.ఈ సందర్బంగా ఎండోమెంట్ సెల్ నూతన బోడుప్పల్ డివిజన్ కో కన్వీనర్ బెల్లంకొండ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ మేడ్చెల్ రూరల్ జిల్లా పరిధిలో హిందూధర్మ పరిరక్షణ,దేవాలయాలను కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
అదేవిధంగా బీజేపి పార్టీని మరింత బలోపేతం చేయడంలో అందరి సహకారంతో తనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని వెల్లడించారు.తనను మేడ్చెల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ సెల్, బోడుప్పల్ డివిజన్ కో కన్వీనర్ గా నియమించడంలో విశేషకృషి చేసిన పార్టీ నాయకులు కే శ్రీనివాస్ ముదిరాజ్,జిల్లా పార్టీ నాయకులకు,బోడుప్పల్ నాయకులతో పాటు పార్టీ సీనియ సీనియర్ నాయకులు,కార్యకర్తలకు నూతన ఎండోమెంట్ సెల్ బోడుప్పల్ డివిజన్ కో కన్వీనర్ బెల్లంకొండ మల్లేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.