ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని వినతి
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మేడ్చల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన వసతులు సమకూర్చాలని, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని తపస్ ప్రతినిధులు కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి నమ్మి తిరుపతి, అత్వెల్లి స్కూల్ కాంప్లెక్స్ ఇన్‌చార్జ్ శ్రీమతి పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.

