📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న -ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...

ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న -ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

📰 Generate e-Paper Clip

*ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న -ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*

 

ప్రెస్ నోట్

26 ఆగస్టు 2026

 

భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో *తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు* గారు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందాన్ని, చైతన్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు ముందుగా అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కళాకారుల పట్ల ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు, మండల మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.