గండుగులపల్లి, ప్రజావాణి న్యూస్, ఆగష్టు 04:
అశ్వారావుపేట
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం నియోజకవర్గ పరిధిలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో వే టు న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫోన్ ద్వారా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను వెంటనే అప్రమత్తం చేసి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్నారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.ప్రజల సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ ఎమ్మెల్యే
RELATED ARTICLES

