📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ప్రజా నివాసాల మధ్య ఉన్న రైస్ మిల్లును వెంటనే మూసివేయాలి

ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ప్రజా నివాసాల మధ్య ఉన్న రైస్ మిల్లును వెంటనే మూసివేయాలి

📰 Generate e-Paper Clip

గరిడేపల్లి ఆగస్టు 6 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో ఉండే సునంద రైస్ ఇండస్ట్రీ అతి భారీ మిల్లు దాన్నుంచి వస్తున్న పొల్యూషన్, సౌండ్,డస్ట్, పురుగులు, వాసన ద్వారా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని, ప్రజల ప్రాణానికి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న మిల్లు పై తక్షణ చర్యలు తీసుకోవాలని, గరిడేపల్లి మండల ఎంఆర్పిఎస్, జై భీమ్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు.

ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో వందమంది గ్రామ ప్రజల అభిప్రాయం మరియు సంతకాలతో, 08-06-2026 నాడు కంప్లైంట్ చేస్తే, కలెక్టర్ *డిస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు* వారికి అట్టి మిల్లు పై తగు చర్యల నిమిత్తం ఎంక్వయిరీ చేసి సమస్యను పరిష్కరించాలని కోరగా, మరియు *డిస్టిక్ సివిల్ సప్లై* వారు 18-06-2026 న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి పంపించిన ఇంతవరకు సూర్యాపేట PCB వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఎంక్వయిరీకి కూడా రాలేదని, ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు ప్రజలపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రజల ఆరోగ్య, ప్రాణా నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని,ఈరోజు గరిడేపల్లి మండల ఎంపీడీవో గారిని మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలిసి, మిల్లు కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి అని, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం జరిగిందని గరిడేపల్లి మండల అధ్యక్షులు రవి పత్రికా ప్రకటనలో తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గరిడేపల్లి మండల ఎంఆర్పిఎస్ కోఆర్డినేటర్ కుర్రి వెంకన్న, గ్రామ అధ్యక్షులు పిట్ట వెంకటేష్, నకిరేకంటి రవి, ఆలంపల్లి శేఖర్, కొత్తపల్లి పవన్, బచ్చలకూరి నాగార్జున, పిట్ట నాగరాజు, మచ్చ ఆదాం మరియు మొదలైన వారు పాల్గొన్నారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.