📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు

పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు

📰 Generate e-Paper Clip

పస్రా–మేడారం రోడ్డుపై పోలీసుల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు

పండుగ చేసుకోండి
ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు పోలీసుల హెచ్చరిక పస్రా–మేడారం ప్రధాన రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీలు పండుగ వేళ రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

గోవిందరావుపేట
పస్రా, ఆగస్టు 28 (ప్రజావాణి)

పండుగ వాతావరణంలో ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పస్రా–మేడారం ప్రధాన రహదారిపై పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, IPS ఆదేశాల మేరకు, ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ సూచనలతో, పస్రా సీఐ పీ. దయాకర్ పర్యవేక్షణలో పస్రా ఎస్సై ఎస్.కె. తాజుద్దీన్, తాడ్వాయి ఎస్సై కె. జగదీష్ గౌడ్, నర్లాపూర్/మేడారం ఎస్సై ఎ. కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.
*మద్యం తాగి వాహనం నడపొద్దు*”
ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలతో చెలగాటమని, ఒక్కరి నిర్లక్ష్యం వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని పోలీసులు హెచ్చరించారు.
యువత ముఖ్యంగా మద్యం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, జీవితాన్ని నాశనం చేసే అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. పండుగలను ఆనందంగా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
*హెల్మెట్ తప్పనిసరి*..
*సీట్ బెల్ట్ మరువొద్దు*
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనంపై ప్రయాణించే వారు కూడా భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. కార్లు, ఇతర పెద్ద వాహనాలు నడిపే డ్రైవర్లు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర వాహన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు*
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
“మీ రక్షణే మా బాధ్యత.. మీ సహకారమే మా బలం” అనే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
*ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యం*
పండుగల సమయంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. వాహనదారులు అత్యుత్సాహానికి వెళ్లకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ఇతరుల ప్రాణాలను కూడా గౌరవిస్తూ ప్రయాణించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని పోలీసులు అవగాహన కల్పించారు.
*యువతకు పోలీసుల పిలుపు*
*మద్యం వద్దు*..
*డ్రగ్స్ వద్దు*..
*వేగం వద్దు*..
*ప్రాణాలపై నిర్లక్ష్యం వద్దు*”
*అంటూ యువతకు పోలీసులు సందేశం ఇచ్చారు.
పండుగ అనేది ఆనందం కోసం అని, ఆ ఆనందం మరొక కుటుంబానికి విషాదంగా మారకూడదని సూచించారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా ప్రయాణించాలని పోలీసులు కోరారు.
పస్రా–మేడారం ప్రధాన రహదారిపై చేపట్టిన ఈ ప్రత్యేక వాహన తనిఖీలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసుల నిఘా ఎంత కట్టుదిట్టంగా ఉందో స్పష్టం చేశాయి.
“మద్యం సేవించి వాహనం నడపడం నేరo . మీ ప్రాణాలకు, ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం. పండుగను సంతోషంగా జరుపుకుందాం.. సురక్షితంగా ఇంటికి చేరుకుందాం.” ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పసరా ఎస్సై తాజుద్దీన్. మేడారం ఎస్సై కమలాకర్. తాడువా ఎస్సై జగదీష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.