📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyపీఏసీఎస్ నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు మాజీ జెడ్పీటీసీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అభినందనలు

పీఏసీఎస్ నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు మాజీ జెడ్పీటీసీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అభినందనలు

📰 Generate e-Paper Clip

పీఏసీఎస్ నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు మాజీ జెడ్పీటీసీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అభినందనలు

 షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS – సింగిల్ విండో) నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులుగా నియమితులైన ప్రతి ఒక్కరికీ మాజీ జెడ్పీటీసీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.రైతులకు ప్రభుత్వం అందించే రుణాలు, విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా పీఏసీఎస్‌లు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి నూతన చైర్మన్లు, సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆకాంక్షించారు.

“పీఏసీఎస్‌లు కేవలం సహకార సంఘాలు మాత్రమే కాదు.. రైతుల ఆర్థిక అభివృద్ధికి బలమైన వేదికలు. నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు రైతుల పక్షాన నిలిచి, ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలి” అని తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పేర్కొన్నారు.

షాద్‌నగర్ నియోజకవర్గంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతుల ఆర్థిక ప్రగతికి సహకార వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, సభ్యులు తమ పదవులకు వన్నెతెచ్చే విధంగా పనిచేసి, రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ మరోసారి వారందరికీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.