📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపదవీ విరమణ పొందిన ఎస్ఐ లకు ఘనంగా వీడ్కోలు - ములుగు*

పదవీ విరమణ పొందిన ఎస్ఐ లకు ఘనంగా వీడ్కోలు – ములుగు*

📰 Generate e-Paper Clip

*పదవీ విరమణ పొందిన ఎస్ఐ లకు ఘనంగా వీడ్కోలు – ములుగు*

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సారమల్లు, ములుగు పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఇమ్మాన్యుయేల్ పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. “పోలీస్ రిటైర్మెంట్ కేవలం వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదు, ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చు” అని అన్నారు.
అనంతరం ములుగు సీఐ సురేష్, ఆర్ఐ స్వామి, డీఎస్పీలు రవీందర్, కిషోర్ కుమార్ మాట్లాడుతూ 42 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ లో ఇద్దరు అధికారులు నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎంతో కష్టపడి పనిచేశారని కొనియాడారు. పండగల్లో కూడా కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తించారని, శేష జీవితం కుటుంబంతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్, ఆర్ఐ వెంకటనారాయణ, పదవీ విరమణ అధికారుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.