నీరుకుళ్లలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీలు
ప్రజావాణి ఆగస్టు 19 ఆత్మకూరు
ఆత్మకూరు, ఆగస్టు 18: ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీలను సోమవారం ఎన్నుకున్నారు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆత్మకూరు మండల ఇన్‌చార్జి నద్దునూరి రఘు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అర్షం దశరథం మాదిగ, అర్షం రాజు మాదిగ, అర్షం బలరాం మాదిగ, మండల మాజీ కార్యదర్శి అర్షం సాగర్ మాదిగ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నీరుకుళ్ల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అర్షం అనిల్ మాదిగ, అధికార ప్రతినిధిగా అర్షం రాజు మాదిగ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కొంగరి నరేష్ మాదిగ, అర్షం అనిల్ మాదిగ, ఉపాధ్యక్షులుగా అర్షం రాకేష్ మాదిగ, మామిడి అఖిల్ మాదిగ, నాగరాపు సాయి మాదిగ, కోశాధికారిగా అర్షం ప్రశాంత్ మాదిగ, కార్యదర్శులుగా నద్దునూరి రాజు మాదిగ, రేణిగుంట్ల శివరాజ్ మాదిగ, సండ్ర నాగరాజు మాదిగ, అర్షం జితేందర్ మాదిగ, అర్షం విఘ్నేష్ మాదిగ, అర్షం రంజిత్ మాదిగ, అర్షం పవన్ కుమార్ మాదిగలను ఎన్నుకున్నారు.
అదేవిధంగా ఎంఎస్పీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అర్షం దశరథం మాదిగ, అధికార ప్రతినిధిగా వడ్డేపల్లి ప్రశాంత్ మాదిగ, ఉపాధ్యక్షులుగా అర్షం సతీష్ మాదిగ, అర్షం సాంబయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా అర్షం బిక్షపతి మాదిగ, సురేష్ మాదిగలను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘం బలోపేతానికి కృషి చేస్తూ, గ్రామంలో సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

