నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి విద్యలో మెరుగైన ప్రతిభ కనబరుస్తారని పిరమిడ్ మాస్టర్స్ సత్తిరెడ్డి, సతీష్, శంకర్ లు పేర్కొన్నారు. సోమవారం చండూరు ఉన్నత పాఠశాలలో జీవ వనం మహాయోగి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో విద్యార్థుల మనోవికాస కార్యక్రమం జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడుతూ ధ్యానం చేయడంలో శ్వాస యందు ధ్యాస ప్రధానమని, ప్రతిరోజు ధ్యాన సాధన వలన సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, భయాలు తొలగడం, జ్ఞాపకశక్తి అభివృద్ధి చెంది ఆందోళనలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు రాపోలు యాదగిరి, ఉపాధ్యాయులు మద్దోజు సుధీర్ బాబు, గంట వెంకటేశ్వర్లు, ఆదిమల్ల రాజు, విద్యార్థులు కొనసాగారు.

