📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadతల్లి పాలే తొలి టీకా... ఆరోగ్య భారతానికి తొలి అడుగు!

తల్లి పాలే తొలి టీకా… ఆరోగ్య భారతానికి తొలి అడుగు!

📰 Generate e-Paper Clip

  1. తల్లి పాలే తొలి టీకా… ఆరోగ్య భారతానికి తొలి అడుగు!

 

 

అర్పణపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.

 

 

 

గర్భిణీలు, బాలింతలకు విస్తృత అవగాహన… తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరించిన నిపుణులు

 

కేసముద్రం, ఆగస్టు 6, ప్రజావాణి

 

 

ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు తల్లిపాలే తొలి పునాది అని పేర్కొంటూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చీర వెంకటమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ బి. జ్యోతి మాట్లాడుతూ, తల్లి పాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి. తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా శిశువుకు సంపూర్ణ పోషకాహారం లభించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతాడు. తల్లిపాలు తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అని వివరించారు.
గర్భిణీలు, బాలింతలు తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి శిశువుకు తొలి ఆహారంగా తల్లిపాలనే అందించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోషకాహారం, శిశు సంరక్షణ, తల్లి ఆరోగ్యంపై పలు సూచనలు అందించి సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయినులు రేణుక, సౌందర్య, విజయ,సహాయకురాలు యాకాంత, ఆరోగ్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ సంఘ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.