బద్వేల్ ఆగస్టు9(ప్రజావాణి)బద్వేల్ పురపాలక సంఘం పరిధిలోని తొట్టిగారిపల్లె గ్రామంలో డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కురిసిన వర్షాలకు గ్రామంలోని వీధి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన కాలువలు లేకపోవడంతో, నీరంతా ఇళ్ల ముందు, రోడ్లపైనే నిలిచిపోయి చెరువులను తలపిస్తోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి, గ్రామంలో జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే రోడ్లపై ఉన్న నీటిని తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే గ్రామంలో శాశ్వత డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టి, బ్లీచింగ్ పౌడర్ చల్లించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.మున్సిపల్ అధికారులు స్పందించి తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
డ్రైనేజీ కాలువలు లేక రోడ్లపై నిలిచిన వర్షపు నీరు
RELATED ARTICLES

