బెజ్జంకి 18 (ప్రజావాణి)
మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో కరీంనగర్ నుంచి ఇల్లంతకుంట మీదుగా చిలాపూర్ గ్రామం మీదుగా నడిచే బస్సు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చిలాపూర్ గ్రామంలో బస్సుకు గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరాచారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కొబ్బరికాయ కొట్టి, ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు.గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరాచారి కృతజ్ఞతలు తెలిపారు. బస్సు సౌకర్యంతో గ్రామ ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

