ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామ పంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సర్పంచ్ మాట్ల లింగయ్య జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.దేశ సమగ్రత,అభివృద్ధి,ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.యువతలో దేశభక్తి,జాతీయతా భావాలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దుండ్ర శ్రీను,వార్డు మెంబర్లు ఎర్రోళ్ల చైతన్య కుమార్,పల్లె రాకేష్, కార్తిక,ఎర్రోళ్ల హైమావతి,మాచర్ల పుష్ప శ్రీపతి సప్న,కోమల పంచాయతీ కార్యదర్శి హిమవంత్,మాజీ సర్పంచ్ దేవేందర్ రావు,కారోబార్ సునీల్,ఫీల్డ్ అసిస్టెంట్ ఎదురుగట్ల రాజేష్,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

