ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని గౌడ సంఘం భూమిలో శుక్రవారం రోజున ఉపాధి హామీ కూలీలతో ఈత మొక్కలను నాటారు. గ్రామంలో మొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఈత చెట్ల ద్వారా గౌడ కులస్థులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈత కళ్ళు తాగడం వల్ల కిడ్నీ రాళ్ళ సమస్యలు నయమవుతాయని, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నం రాజు, సంఘం నాయకులు సత్యం, శ్రీను, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
గుల్లకోటలో ఈత మొక్కల నాటే కార్యక్రమం: గౌడ కులస్థులకు ఆసరా
RELATED ARTICLES

