📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliకాసిపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఐదుగురు అరెస్ట్!

కాసిపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఐదుగురు అరెస్ట్!

📰 Generate e-Paper Clip

 

రూ. 1.10 లక్షల నగదు, 5 మొబైళ్లు, 3 బైక్‌లు స్వాధీనం | సోమగూడెం గ్రామంలో గుట్టురట్టు.

రామగుండం కమిషనరేట్ ఆగస్టు 2 ప్రజావాణి :

మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం/టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. సోమగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున పందాలు కాస్తూ పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు.

రహస్యంగా నగదు పందెాలు పెట్టి పేకాట నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ బృందానికి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో సదరు ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించి, పేకాట ఆడుతున్న ఐదుగురిని ఆకేపట్టారు.

ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి రూ. 1,10,630 నగదుతో పాటు 52 పేక ముక్కలు, 5 మొబైల్ ఫోన్లు మరియు 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, సీజ్ చేసిన నగదు మరియు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాసిపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. తమ పరిసర ప్రాంతాల్లో పేకాట, ఇతర ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ, లేదా రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులకు గానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశా

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.